ఇరిగేషన్ భూములు మాయం

రంగారెడ్డి జిల్లాలో 2132 చెరువులు, కుంటలు ఉండగా, 10,946 ఎం ఎఫ్‌టీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో 70,067 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వం వీటిలో ఏటా 1.20 కోట్ల చేప పిల్లలు వదులు తుంది. ఏటా 400 టన్నులకుపైగా దిగుబడి వస్తుంది. అనేక మంది మత్స్యకారులు ఈ చెరు వులనే నమ్ముకుని జీవిస్తున్నారు. ఆయా చెరువుల్లో ఇటీవల నీరు తగ్గుముఖం పట్టింది. బఫర్‌జోన్లు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నీరు ఖాళీ అవడంతో. ఇదే అద ననుగా భావించి, రాత్రికి రాత్రే రాళ్లు, మట్టితో నింపేస్తున్నారు. చెరువు, కుంటల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. చెరువులు, కుంటలు. వరద కాల్వలు మాయమై పోతుండగా, వాటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ తర్వాత ఇబ్బందులు పడక తప్పడం లేదు.
మచ్చుకు తుర్కయాంజాల్‌ మాసబ్‌ చెరువు 499 ఎకరాల విస్త్రీర్ణంలో విస్త రించి ఉంది. దీనిలో 320 ఎకరాల శిఖం భూమి ఉంది. సర్వే నంబర్‌ 205లోని సుమారు రూ.300 కోట్ల విలువ చేసే భూములపై రియల్టర్ల కన్ను పడింది. 12 ఎకరాలకు 2016లోనే ఎన్‌ఓసీ జారీ చేశారు. ప్రస్తుతం శిఖం భూముల్లో ఐదు నుంచి ఎనిమిది అడుగుల లోతు నీరు నిల్వ ఉంది. కొంతకాలంగా రియల్టర్లు రై తుల పేరు చెప్పి చెరువు మధ్యలో రాళ్లు, మట్టి నింపుతున్నా.. పట్టించుకున్న నా థుడు లేడు. కందుకూరు మండలం గూడురు సర్వే నంబర్‌ 5లోని పూచర్లకుం టలో ఓ స్థిరాస్థి సంస్థ ఫాం లాండ్‌ పేరుతో వెంచర్‌ వేస్తుంది. నీటి నిల్వ ప్రదేశం తో పాటు అలుగు, తూములను ధ్వంసం చేశారు.
మణికొండ మున్సిపాలిటీ ఇబ్రహీంబాగ్‌ చెరువు (నెక్నం పూర్‌ సర్వే నంబర్‌ 40లో 108 ఎకరాల్లో ఉన్న చెరువు ఉంది. ఈ చెరువుకు ఆనుకుని సర్వే నంబ ర్‌లు 53,54 బఫర్‌జోన్‌లోనూ ఇప్పటికే భారీగా నిర్మాణలు వెలిశాయి. కడుతు న్నప్పుడు కళ్లప్పగించి చూసిన అధికారులు తీరా నిర్మాణాలు పూర్క్తెన తర్వాత వా టిలో కొన్నింటిని ఇటీవల కూల్చివేశారు. మంచాల మండలం ఆగపల్లి సమీపంలో ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చేసిన వెంచర్‌. కల్వర్ట్‌ కింది భాగంలో ఉన్న వరద కాల్వను పూర్తిగా ధ్వసం చేసి, ప్లాట్లు చేశారు. వీటిని కొనుగోలు చేసిన వారికి భవిష్య త్తులో వరద ముప్పు తప్పదు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని, భూములు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love