సర్దుకుపోయే మనస్థత్వం లేకపోవడమే కారణమా?

ఈ మధ్య కాలంలో బంధువుల కుటుంబాల్లో, స్నేహితుల కుటుంబాల్లో ఎక్కడ చూసినా తరచుగా వినిపిస్తున్న మాట విడాకులు. ఒకప్పుడు ఆ మాట వింటే ఏదో పెద్ద తప్పిదంలాగా అనిపించేది. కాని ఈ రోజుల్లో అది సర్వసాధారణం అయిపోయింది. దానివల్ల family system కూడ effect అవుతోంది కదా! ఇంతకు ముందు ఆడపిల్లలు సర్డుకుపోయే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా చదువులు, సంపాదనలు వచ్చాక సర్దుకు పోటానికి ఏమాత్రం ఒప్పుకోవటం లేదు అని చాలా మంది అంటుంటారు. అది ఎంత వరకు వాస్తవం అంటారు? – రామకృష్ణ, నిజామాబాద్‌.

ఇది చాలా పెద్ద topic రామకృష్ణ గారు! గత పదేళ్లుగా మన దేశంలో విడిపోతున్న భార్యాభర్తలు, విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తల సంఖ్య ప్రతి యేట పెరుగుతూనే ఉంది. ఎందుకు విడిపోతున్నారు అన్నదానికి వాళ్ళు చెపుతున్న కారణాలు కూడా రకరకాలుగా వుంటున్నాయి.
కానీ మీరన్నట్టు ‘విడాకులు’ అన్న మాట వినబడగానే చాలా మంది నోటి నుంచి వచ్చే స్టేట్‌మెంట్‌ మాత్రం ‘అమ్మాయిలు చదువుకుని, సంపాదనాపరులయాకే విడాకులు తీసుకోవడం ఎక్కువైంది’ అని. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. అయితే, కేవలం అది మాత్రమే కారణం కాదు.
విడాకులు తీసుకుంటున్న కారణాల్ని పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే కారణాలు వేరు, పట్టణ – నగర ప్రాంతాల్లో కనిపించే కారణాలు వేరేగా వుంటాయి. పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్తలు విడిపోవటానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి మితిమీరుతున్న నాగరికత అని చెప్పాలి. దానివల్ల భార్యాభర్తల మధ్య వస్తున్న పెద్ద సమస్య ఒకరిపై ఒకరికి నమ్మకం లేక పోవటం. అసలు సంసారానికి పునాదే నమ్మకం.
ఈ తరం యువత చాలా మంది పాశ్చాత్య నాగరికతని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అనుసరిస్తున్నారు కూడా. పెళ్లికాక ముందు ఆడపిల్లలు మగపిల్లలు స్నేహం పేరుతో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్య్రం వుండటంతో సరదా విందులు, వినోదాలు, విహారాలతో జీవితాన్ని ఎంజారు చేస్తున్నారు. కాలుకదిపితే సెల్ఫీలు. వాటిని వెంటనే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటం. తమ స్నేహాన్ని ప్రపంచం మొత్తానికి చాటుకోవడం. ఈ రోజుల్లో చాలా మంది యువత జీవనశైలి ఇలాగే వుంటోంది.
అయితే, సమస్యల్లా ఎక్కడ వస్తోంది? వాళ్ళు ఫాలో అవుతున్నది వెస్ట్రన్‌ కల్చర్‌. కానీ వాళ్ళ అంతర్గత ఆలోచనలు మాత్రం తరతరాలుగా అంటిపెట్టుకుని ఉన్న భారతీయ సాంప్రదాయం అన్న రూట్స్‌ నుంచి విడిపడటం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిలో కూడా. సమస్య అక్కడే వస్తోంది. ఆలోచనల్లో సిద్ధాంత పరమైన ఆధునికత లేదు, జీవించే పద్ధతిలో కట్టుబాట్ల మీద నమ్మకం లేదు. అందుకే పెళ్లికి ముందు సరదాలు, సంతోషాలు అనుకున్నవన్నీ పెళ్లయ్యాక సమస్యలుగా తయారవుతున్నాయి.
నిజానికి ఆడపిల్లలు, మగపిల్లలు స్నేహంగా వున్నంత మాత్రాన, కలిసి తిరిగినంత మాత్రాన చెడిపోతారు అనుకోవటం చాలా పొరపాటు. అందరూ చెడు భావనతోనే స్నేహాలు చేయరు. కానీ ఆ నమ్మకం చాలా మంది భార్యాభర్తల్లో వుండటం లేదు. అందుకే విడాకుల దాకా వెళుతున్నారు.
కౌన్సె లింగ్‌కి వచ్చినపుడు మేం ఎంత అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు కనీసం మా మాటలు వినటానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళ దృష్టిలో సొల్యూషన్‌ అంటే ఎంత త్వరగా, ఎంత కూల్‌గా విడిపోవచ్చు అన్నదే. వాళ్ళ మెంటల్‌ స్టేటస్‌ అంతలా వున్నప్పుడు విడిపోవడమే ఒక రకంగా మంచిదేమో అనిపిస్తుంది. లేకపోతే ఇంకా worst situations face  చేయాల్సి వస్తుంది.
నిజానికి ప్రతిమనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకాలనే కోరుకుంటారు. ఇది ఎంతో అవసరం కూడ. అయితే ఆ స్వేచ్ఛ అనేది ఎంతవరకు అనేదే ఇక్కడ ప్రశ్న!
మనం ఏ పని చేస్తున్నా వాటి పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని వివేకంతో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులు రాకుండా వుంటాయి. జీవితం కూడ సాఫీగా సాగిపోతుంది.
భార్యాభర్తల మధ్య విడాకులకి దారి తీస్తున్న మరి కొన్ని ప్రధాన కారణాల గురించి next time చర్చిద్దాం. వాటితో పాటు షశీఅరవనబవఅషవర గురించి కూడా ఆలోచించటం ఎంతో అవసరం.
– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌,
ఫ్యామిలీ కౌన్సిలర్‌

Spread the love