రుణాలివ్వడమూ సాయమేనా ?

బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతులకు రుణాలివ్వడాన్ని కూడా బీజేపీ నేతలు సాయం చేసినట్టుగా చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో స్క్రిఫ్టు తయారు చేస్తే హైదరాబాద్‌లో చదువుతున్నారని ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో రూ.20లక్షల కోట్ల రుణాలు అందాయని పేర్కొన్నారు. గొర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23,948 వేల కోట్ల రుణం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ గొప్పతనమా? అని ప్రశ్నించారు. ఒక కేంద్ర మంత్రి రుణాలను గొప్పగా చొప్పుకోవడం సమంజసమా? అని ప్రశ్నించారు. రూ. 6300 కోట్లతో ప్రారంభించిన రామగుండం యూరియా ఫ్యాక్టరీ నుంచి అరబస్తా యూరియా రైతులకు ఉత్పత్తి చేశారా? దానిని వాణిజ్య మార్కెట్‌లోకి పంపించారా?అని నిలదీశారు. మరి ఇందులో కేంద్రం రైతాంగానికి చేసిన మేలేంటని ప్రశ్నించారు. వాస్తవాలను మరుగు పరుస్తూ కేంద్ర మంత్రి రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కర్నాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి నిధులు కేటాయించాలంటూ బీజేపీ నేతలు అడగలేదని గుర్తు చేశారు.

Spread the love