కిచెన్ సింక్ బ్లాక్ అవ్వడం అనేది చాలా మంది ఇళ్లల్లో ఎదురయ్యే సమస్య. గిన్నెలు తోమినప్పుడు మిగిలే వ్యర్థ పదార్థాలు సింక్‌లో ఇరుక్కుని నీరు పోకుండా బ్లాక్ అయిపోతుంది. పాత్రలు శుభ్రం చేసిన తర్వాత ఆహారం ఇరుక్కుపోవడం వల్ల లేదా సింక్ పరిశుభ్రంగా వాష్ చేయకపోవడం, పైపులో నాచు పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల అందులో నుంచి నీరు బయటకు పోదు. మీ కిచెన్ సింక్ కూడా పదేపదే బ్లాక్ అయిపోతూ ఉంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి వాడితే ఆమ్ల చర్య జరుగుతుంది. ఇది మురికిని తొలగించటంలో బాగా పనిచేస్తుంది. కిచెన్ సింక్ మూసుకుపోయి అందులో చెత్త పేరుకుపోతే శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ మిక్స్ చేసి సింక్ రంధ్రంలో వేసి వదిలేయాలి. కొద్ది సేపటికే పైపు లోపల పేరుకుపోయిన చెత్త కరిగిపోవడం మొదలవుతుంది. పదినిమిషాల తర్వాత సింక్ లోపల నీళ్లు పోయాలి. ఇది కరిగిన మురికిని సింక్ నుంచి బయటకు తోసేస్తుంది.
నిమ్మకాయ, ఈనోతో
వంటగది సింక్‌ను శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఈనోను కూడా ఉపయోగించవచ్చు. ఈనో కూడా ఆమ్లంలాగే పనిచేస్తుంది. దీనిని నిమ్మకాయతో కలిపినప్పుడు ఆమ్ల ప్రతిచర్య ఉంటుంది, ఇది దుమ్ము, జిడ్డును శుభ్రపరుస్తుంది. నిమ్మకాయ, ఈనో మిశ్రమంతో సింక్ ను శుభ్రం చేయడం వల్ల పైపులో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడమే కాకుండా సింక్ లో పేరుకుపోయిన జిడ్డు వదులుతుంది. ఇది సింక్‌ను కొత్తగా, మెరిసేలా చేస్తుంది. మొదట ఈనో పౌడర్ ను ఒక గిన్నెలో వేయండి, ఇప్పుడు దాని పై నిమ్మరసం పిండండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సింక్ లో వేసి స్క్రబ్బర్ సహాయంతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇది సింక్ ను పూర్తిగా శుభ్రపరుస్తుంది.