గత రెండు నెలల్లో అతిపెద్ద దాడి, మారణకాండకు దిగిన యూదు దురహంకారులు.గాజాలోని రెండవ పెద్ద పట్టణమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయిల్ మిలిటరీకి అడుగ డుగునా ప్రతిఘటన. ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ నౌక లపై ఎమెన్ సాయుధ శక్తుల దాడి, సంయమనం పాటిం చాలని అమెరికాను కోరిన సౌదీ అరేబియా. ఇప్పటికైనా మానవతా సంక్షోభాన్ని నివారించండని భద్రతా మండలిని తొలిసారిగా కోరిన ఐరాస ప్రధాన కార్యదర్శి. ఈ పరిణా మాలన్నీ గాజాలో సాగుతున్న మారణ కాండ, దాని పర్యవ సానాలు మధ్య ప్రాచ్యం మీద పడుతున్న తీరు, మొత్తం మీద దిగజారుతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి. గాజాలోని 250 లక్ష్యాలపై మంగళవారం నాడు వైమానికదాడులు జరిగాయి. దీంతో మానవతాపూర్వక సాయానికి కూడా ఆటంకం కలిగింది. శరణార్ధి శిబిరాల్లో ఖాళీలేకపోవటంతో రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో పాలస్తీనియన్లు ఉంటున్నా రు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జనాన్ని ఖాళీ చేయించినపుడు మరోచోట వారికి తగినన్ని ఏర్పాట్లు చే యాలని గాజాలో ఎక్కడా అలాంటి ఆనవాళ్లు లేవని ఐరాస బాలల నిధి ప్రతినిధి జేమ్స్‌ఎల్డర్ చెప్పటం మానవతా పూర్వక సాయం అందిస్తున్నట్లు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రచారం బండారాన్ని వెల్లడించింది. ఇరవై మూడులక్షల మంది పౌరుల్లో 19 లక్షల మంది నెలవులు తప్పారు, పది లక్షల మంది ఐరాస శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు.
భవిష్యత్‌లో తమ మీద దాడులు జరగకుండా గాజా ప్రాంతాన్ని మిలిటరీ రహితంగా ఉంచాలన్న ఇజ్రాయిల్ ప్రతిపాదనను అమెరికా కూడా వ్యతిరేకించింది. అది పాల స్తీనా ప్రాంతంగా ఉండాల్సిందేనని పేర్కొన్నది.గాజా ఎలా ఉండాలన్నది అక్కడి పౌరులు నిర్ణయించాలని టర్కీ పేర్కొ న్నది. ఇజ్రాయిల్ మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచి ఎమెన్‌లోని హౌతీ సాయుధశక్తులు అడపాతడపా ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తు న్నాయి. లక్షల మంది సాయుధులతో పాటు దాని దగ్గర నౌకా దళం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్ దాడులను ఆపివేయించేందుకు అమెరికా మీద ఒత్తిడి తేవటమే ఈ దాడుల లక్ష్యం. ఇప్పటివరకు అమెరికా పాటించిన సంయ మనాన్ని ముందు కూడా కొనసా గించాలని తాజాగా సౌదీ అరే బియా కోరింది. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తూ కవ్వి స్తున్నది. ఇటీవలి కాలంలో ఇరాన్‌తో సయోధ్య కుదుర్చు కున్న సౌదీ నేతలు ఇజ్రాయిల్ దాడులను ఆటవిక చర్యలంటూ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముం దే అమెరికా కుట్రలో భాగంగా ఇదే సౌదీ తొమ్మిదిన్నరేండ్లు పాటు హౌతీ సాయుధులను అణిచేందుకు విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారితో నేరుగా చర్చలు జరుపుతూ శాంతి క్రమం ముందుకు పోవాలని కోరుకుం టున్నది. ఎమెన్ పౌరులు, అరబ్బు. ఇస్లామిక్ దేశాల్లో స్వేచ్చను కోరుకొనే జనాల ఆకాంక్షల మేరకు పాలస్తీని యన్లకు మద్దతుగానే తాము దాడులు చేస్తున్నట్లు ఎమెన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు ప్రకటించాయి. దాడులను విరమించే వరకు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశాయి. వారు ప్రయోగిస్తున్న క్షిపణులు సౌదీ గగన తలం నుంచే వెళుతున్నందున అమెరికా ప్రతిదాడులకు పూనుకుంటే మధ్యలో సౌదీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అందు వలన వివాదం మరింత ముదరకుండా చూసుకొనేందుకే సంయమనం పాటించాలని కోరిందన్నది స్పష్టం. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు తిష్టవేసి ఆ ప్రాంత దేశాల మీద బెదిరింపులకు దిగిన అంశం ఎరిగినదే.
గాజాలో ప్రస్తుతం ఉన్న తీవ్ర పరిస్థితి అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు ముప్పు తెచ్చే దిగా ఉన్నందున వెంటనే భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరటం గమనించాల్సిన అంశం. సాధారణంగా దేశాల నుంచి అలాంటి వినతులు వస్తాయి. ఐరాస నిబంధన 99 ప్రకారం ప్రధాన కార్యదర్శి కూడా కోరవచ్చు. గుటెరస్ పద వీకాలంలో ఈ నిబంధనను ఉపయోగించు కోవటం ఇదే ప్రధమం. అక్కడ పౌరులకు ఎలాంటి రక్షణ లేదని, ఇంత వరకు ఏ సంక్షో భంలోనూ లేని విధంగా రెండు నెలల కాలం లో గాజాలో 130 మంది ఐరాస సహాయక సిబ్బంది కూడా ఇజ్రాయిల్ దాడుల్లో మర ణించారని భద్రతా మండలి అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. గాజాలో పరి స్థితి విషమించటంతో పరిసర దేశాల పౌరు ల్లో సహనం నశిస్తున్నది. ఎప్పుడేం జరుగు తుందో తెలియని స్థితి. ఇజ్రాయిల్ దుండ గాల నిలిపివేతకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీద మరింత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితి దిగజారుతోందా !
10:53 pm