నవతెలంగాణ – హైదరాబాద్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారి, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఓ పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా, దానిని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో పాఠశాల ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయి. స్కూల్లో ఉగ్రవాదులు ఉండడంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.