గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధం – మతోన్మాదుల వైఖరి

Israel's War on Gaza - The Fanatics' Attitudeకేరళలోని కలామస్సెరిలో క్రిస్టియన్‌ గ్రూపు సమావేశంపై జరిగిన బాంబు పేలుళ్ళను మతతత్వ పెట్టుబడిగా చేసుకోవాలన్న ఆత్రంతో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చేసిన యత్నాలు జుగుప్స కలిగిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధానికి సంబంధించి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాల ప్రచారం తాలూకు విషపూరిత స్వభావాన్ని ఇది బయటపెట్టింది.
బాంబు పేలుళ్లు సంభవించిన వెంటనే, చంద్రశేఖర్‌ మాట్లా డుతూ, క్రిస్టియన్‌ సమావేశాన్ని జిహాదీ శక్తులు లక్ష్యంగా చేసుకు న్నాయని అవాకులు చవాకులు పేలారు. ఆ సమావేశంలో ప్రసం గించేందుకు హమాస్‌ నేతను కేరళ ప్రభుత్వం అనుమతించిందని, పర్యవసానంగా 24 గంటల్లో బాంబు పేలుడు సంభవించిందని నిందించారు. సీపీ(ఐ)ఎం, కాంగ్రెస్‌లు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. హమాస్‌ మాజీ చీఫ్‌ ఇస్మా యిల్‌ హనియె చేసిన ప్రసంగ పాఠం ఇంటర్‌నెట్‌లో అందుబాటు లో వుంది, దాన్ని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, అంతే తప్ప హమాస్‌ నేత ప్రసంగాన్ని అనుమతించే ప్రశ్నే లేదు. పైగా, చంద్రశేఖర్‌, ఆయన పార్టీ చెబుతున్నట్లుగా హమాస్‌ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన తీవ్రవాద సంస్థ కాదు.
బాంబు పేలుడు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే, ఒక వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడికి తనదే బాధ్యత అని ప్రక టించాడు. ఆ వ్యక్తి క్రైస్తవ గ్రూపులోని అసమ్మతి సభ్యుడు. ఇది మంత్రి చంద్రశేఖర్‌కు ఇబ్బందికరంగా పరిణమించింది కాబోలు. ఆయన చేసిన వ్యాఖ్యల్లోని విషాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఎందు కంటే, బీజేపీ, హిందూత్వ శక్తులకు సంబంధించిన సోషల్‌ మీడియా గ్రూపులు అదే పనిగా సాగిస్తున్న పాలస్తీనా వ్యతిరేక మతోన్మాద ప్రచారం తరహాలో ఈ వ్యాఖ్యలు వున్నాయి. పాలస్తీని యన్లందరూ జిహాదీలని, హమాస్‌ తీవ్రవాద సంస్థ అని ముద్ర వేశారు. ఇజ్రాయిల్‌ ఇప్పుడు ఎలాగైతే తీవ్రవాద హింసను ఎదు ర్కొంటోందో అలాగే భారత్‌లో ముస్లింల నుండి కూడా హిందు వులు ఇటువంటి ముప్పే ఎదుర్కొంటారని వారు హెచ్చరిస్తు న్నారు. ఇస్లామా ఫోబియాను పెంపొందించేందుకు పాలస్తీని యన్లు, హమాస్‌ అత్యాచారాలకు పాల్పడ్డారంటూ కట్టుకథలు అల్లి, వాటిని విస్తృతంగా ప్రచారంలో పెడుతున్నారు. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయిల్‌ను ఒక నమూనాగా చూపు తున్నారు. ఈ మతోన్మాద ప్రాపంచిక దృక్పథం స్వతంత్ర దేశం కోసం పాలస్తీనియన్లు జరుపుతున్న పోరాటాన్ని ముస్లిం సమ స్యగా చూస్తోంది. పాలస్తీనియన్లను వారి మాతృభూమి నుండి వెళ్ళగొట్టి జాతి ప్రక్షాళన గావించాలని చూస్తున్న యూదు దుర హంకార ప్రాజెక్టుకు సహజంగానే మద్దతునిస్తోంది. తమ హక్కుల కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లను తీవ్రవాదులుగా చిత్రిస్తూ ఇజ్రాయిల్‌ ప్రభుత్వం, యూదు తీవ్రవాదులు సాగించే ప్రచారాన్నే మక్కీకి మక్కీగా ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ అనుసరిస్తున్నాయి. హిందూ త్వ వ్యవస్థాపకుడు వి.డి.సావర్కర్‌ కాలం నుండి హిందూ మిత వాద జాతీయవాదులు యూదువాదానికి… అరబ్బులను, పాలస్తీ నియన్లను తరిమికొట్టడం ద్వారా ఇజ్రాయిల్‌ దేశ ఏర్పాటుకు మద్దతునిస్తూనే వున్నారు.
ఈ హిందూత్వ ప్రపంచ దృక్పథమే ఈనాడు మోడీ ప్రభుత్వ వైఖరిని నిర్దేశిస్తోంది. ఇజ్రాయిల్‌ను పూర్తిగా సమర్ధిస్తూ, గాజాపై కాల్పుల విరమణకు ఇచ్చే పిలుపులను తిరస్కరిస్తూ జో బైడెన్‌, రిషి సునాక్‌, ఒలాఫ్‌ షుల్జులతో నరేంద్ర మోడీ కూడా జతగ ట్టారు. మానవతా సంధి కోసం పిలుపిస్తూ ఐక్యరాజ్య సమితి జన రల్‌ అసెంబ్లీ చేసిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో గైర్హాజరవడం ద్వారా భారత్‌, ప్రపంచ పేద దేశాల వైఖరికి దూరం పాటించింది. ఇజ్రాయిల్‌కు గుడ్డిగా మద్దతిస్తున్న పశ్చిమ దేశాల సరసన చేరిం ది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానానికి 120 దేశాలు మద్దతిచ్చాయి. గాజాపై ఆటవిక దాడి, దండయాత్ర జరుగుతుం టే, ఇజ్రాయిల్‌ సాయుధ బలగాలు పాల్పడుతున్న యుద్ధ నేరాలపై భారత ప్రభుత్వం మౌనం వహిస్తోంది. వంద మందికి పైగా పౌరులు మరణించినటువంటి ఉత్తర గాజాలోని జబాలియా శరణార్ధ శిబిరంపై బాంబు దాడి తర్వాత కొన్ని యూరోపియన్‌ దేశాల విదేశాంగ మంత్రులు యుద్ధంలో అంతర్జాతీయ నిబంధ నలకు కట్టుబడి ఉండాలని ఇజ్రాయిల్‌ను కోరారు. కానీ భారత విదేశాంగ శాఖ మాత్రం ఈ విషయంలో మౌనం వహించింది.
ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలని కోరుతున్న పాలస్తీనియన్ల ఆశయం పట్ల నిబద్ధత ఉందంటూనే, మరో పక్క ఇజ్రాయిల్‌కు మద్దతును ఇస్తూ రెండింటినీ సమతుల్యం చేస్తున్నామనే సాకుతో దానికి తిలోదకాలిస్తున్నది. మహిళలు, చిన్నారులతో సహా గాజా లోని ప్రజలపై మూకుమ్మడి హత్యలకు, తినడానికి తిండి, తాగ డానికి నీరు లేక సామూహిక ఆకలిచావులకు పాల్పడేందుకు నెత న్యాహు ప్రభుత్వానికి అమెరికా పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ అమాన వీయమైన వ్యూహానికి మోడీ ప్రభుత్వం సహకరిస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాలస్తీనా ప్రజలకు మద్దతునివ్వక పోగా, పాలస్తీనియన్లకు మద్దతుగా, ఇజ్రాయిల్‌ దూకుడుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలను కేంద్రంలోని మోడీ ప్రభు త్వం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా సమావేశాన్ని నిర్వహించేందుకు యత్నించిన 92 ఏళ్ళ మాజీ జనసంఫ్న్‌ నేతను జమ్మూలో అరెస్టు చేయడం ఇందుకు తాజా ఉదాహరణ.
కాల్పుల విరమణకు ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తిరస్కరిస్తుండడం చూస్తుంటే గాజాలో యుద్ధం సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాలస్తీనియన్లకు సంఘీభావంగా వామపక్షాలు, ప్రజా స్వామ్య శక్తులు తమ పోరాటాన్ని, ఉద్యమాలను మరింత విస్త రించి, ఉధృతం చేయాల్సిన అవసరం వుంది. ఈ అంశంపై మోడీ ప్రభుత్వ విప్లవ ప్రతీఘాత, మతోన్మాద వైఖరిని ఎండగట్టాల్సి వుంది.
( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love