నవతెలంగాణ – హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ ప్రయోగాల సమయంలో..3,2,1.. అంటూ కౌంట్ డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్మతి (50) గురువారం మృతి చెందారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవలి చంద్రయాన్-3 మిషన్లో చివరిసారిగా కౌంట్ డౌన్ విధులు నిర్వర్తించారు.