హైదరాబాద్ : 2023 ఐఎస్‌ఎస్‌ఓ (ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్) జాతీయ క్రీడలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది జాతీయ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లను హైదరాబాద్‌లోని ది గాడియం స్కూల్ నిర్వహిస్తుంది. ఈ క్రీడా ఈవెంట్లు అక్టోబర్ 2న ముగియనున్నాయి. ఈవెంట్ ఆరంభ కార్యక్రమంలో గాడియం స్కూల్ డైరెక్టర్ కీర్తీ రెడ్డి, షట్లర్లు ప్రియాన్షు రజావత్, కావ్య గుప్తా, బుద్దా అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.