12 నుంచి పసిడి బాండ్ల జారీ

12 నుంచి పసిడి బాండ్ల జారీన్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ మరోమారు పసిడి బాండ్లను జారీ చేయనుంది. ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుందని ఆర్‌బిఐ వెల్లడించింది .ఒక్కో గ్రాము ధరను రూ.6,263 గా నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఇప్పటి వరకు జూన్‌, సెప్టెంబర్‌, డిసెంబర్‌లో మూడు విడతలుగా బాండ్లను జారీ చేశారు. నాలుగో విడతలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దీంతో ఒక్కో గ్రాము రూ.6,213కు లభించనుంది. కనీసం ఒక్క గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్‌ పీరియడ్‌ 8 ఏళ్లు ముగిసిన తర్వాత అప్పటి ధరను చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత కావాలంటే వైదొలగడానికి వీలుంది. అన్ని బ్యాంక్‌లు, తపాళ శాఖ, స్టాక్‌ ఎక్సేంజీలు, ఆర్‌బిఐ సహా పలు విత్త సంస్థల్లో పసిడి బాండ్లను కొనుగోలు చేయడానికి వీలుంది.

Spread the love