నవతెలంగాణ- దుబ్బాక రూరల్
మెదక్ ఎంపీ, బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని బీఆరీస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపురి శేఖర్ గౌడ్ ,పెద్దగుండెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మాల్లుగారి ప్రేమ్ కుమార్అన్నారు. శుక్రవారం నూతన అక్బర్ పేట్ భూంపల్లి మండలానికి చెందిన పోతారెడ్డిపేట్ గ్రామస్తులతో పాటు ,దుబ్బాక మండలానికి చెందిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న 214 మందికి లర్నింగ్ లైసన్స్ పత్రాలను సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మెదక్ ఎంపీ రోడ్డు ప్రమాద నివారణకు యువతకు లైసెన్స్ లు అందిస్తామని చెప్పడం హర్షణీయమని అన్నారు.కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ ఈర్షద్ హుస్సేన్, తొగుట మండల అధ్యక్షులు నంట పరమేశ్వర్ రెడ్డి, ఆకారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు మర్కంటి నవీన్, దుబ్బాక మండలం బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు గంట అజయ్ కుమార్, తదితరులు ఉన్నారు .