నియామక పత్రం అందజేత..

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ , తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎన్.ఆర్.ఐ కువైట్ విభాగం అధ్యక్షులు బట్టు స్వామి ఆధ్వర్యంలో కువైట్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షులుగా గా ముసల నవీన్ చారిని కువైట్ లో ఎన్నుకోవడం జరిగిందని. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాస శ్యామ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. కువైట్ దేశంలో మోర్తాడ్ మండలానికి చెందినటువంటి బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా వారికి వెన్నంటే ఉంటూ వారిని ఆపదలలో ఆదుకుంటానని బీసీల పక్షపాతిగా ఉంటానని ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్ కి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో ముసల నరసయ్య చారి, సుమన్ మలేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love