ఇది రైతు ప్రభుత్వం..

– రుణమాఫీ పత్రాలు, నూతన రైతు రుణాల అందజేత..
– ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్..
నవతెలంగాణ-డిచ్ పల్లి : బీఅర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షాపతని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాపతని ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ అన్నారు.మంగళవారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సొసైటీలో రుణమాఫైన రైతులకు రుణమాఫీ పత్రాలతో పాటు తిరిగి రైతుల అవసరాలకు అనుగుణంగా నూతనంగా రుణాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ సాంబార్ మోహన్ మాట్లాడుతూ..రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ వర్తి స్తుందని,ఈ నేలా చివరి వరకు బ్యాంకు, సహకార సొసైటీ లలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు ప్రకటించిన కటఫ్ తేది లోని తీసుకున్న రైతులకు ఈ నేలా చివరి వరకు తమ తమ ఖాతాల్లో జమ అవుతాయని, రుణమాఫీ కానీ  రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని డీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ అన్నారు. అనంతరం పలువురికి నూతనంగా వ్యవసాయ రుణాలను అందజేశారు.సోసైటి పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన రైతులు సోసైటి కార్యాలయానికి వచ్చి రుణాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సహకార సొసైటీ కార్యదర్శి తేజ గౌడ్, క్యాషియర్ రాజన్న, డైరెక్టర్లు, పిఎసిఎస్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
Spread the love