– మణిపూర్ ప్రభుత్వ ప్రకటన
ఇంఫాల్ : ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలు, సంస్థల పేర్లు మార్చడం నేరమని మణిపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు వెల్లడయితే సంబంధిత చట్టాల ప్రకారం విచారణ జరుగుతుందని పేర్కొంది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా జిల్లాలు, సబ్ డివిజన్లు, స్థలాలు, సంస్థలు పేర్లను మార్చే ఉద్దేశపూర్వక చర్యలను ఎవ్వరూ చేయకూడదు లేదా ప్రయత్నించకూడదు’ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల సంక్షోభం నెలకున్న సమయంలో కొన్ని సంస్థలు, కొంత మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా జిల్లాల పేరు మార్చడం లేదా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటిఫికేషన్‌లో తెలిపారు.