– మండల తహసీల్దార్ విజయ్ కుమార్
నవతెలంగాణ-కొడంగల్
సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించి, గౌరవించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మండల తహసీల్దార్ విజరు కుమార్ అన్నారు. ఆది వారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వయో వృద్ధులను మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల తహసీల్దార్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగు ణం గా ప్రశాంత వాతావరణంలో పారదర్శంగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. వయోవృద్ధులకు ఎంతో అను భవం ఉంటుందని వారి ద్వారా కొంతైనా నేర్చుకోవాల న్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈసారి ఎన్ని కల్లో 80 ఏండ్లు పైబడిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు. వృద్ధులను ప్ర తి ఒక్కరూ గౌరవిస్తూ వారి అనుభవాలతో చెప్పే అంశాల ను ఆచరిస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచు కోవాలన్నారు. జీవితంలో వృద్ధాప్యం ఒక వరమని అది శా పంగా ఉండకూడదని, ఆ దిశగా సమాజంలో ప్రతి ఒక్క రూ వృద్ధులను గౌరవిస్తూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కుమార్, ఆర్‌ఐలు రామచంద్రరావు, శృతి తదితరులున్నారు.