మహిళలను సంస్కార హీనంగా మాట్లాడం సరికాదు

– మహిళలు రాజకీయాలలో చురుకుగా ఉంటే ఓర్వలేనితనమా?
– రాపోలు రాములు ప్రీతి రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
– బోడుప్పల్‌ డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీ రవి గౌడ్‌
నవతెలంగాణ-బోడుప్పల్‌
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వేదికలు దొరికితే చాలు ఉకదంపుడు ఉపన్యా సాలు దంచికొట్టే నాయకులకు రాజకీయాలలో చురుకుగా ఉండే మహిళలపై సంస్కార హీనం గా మాట్లాడం సరైంది కాదని బోడుప్పల్‌ డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవి గౌడ్‌ అన్నారు. శుక్రవారం బోడుప్పల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో కార్పొరేటర్లు కాటపల్లి లత రాంచంద్రారెడ్డి, బొమ్మకు సుగుణ బాలయ్య, పులకండ్ల హేమలత జంగారెడ్డి, దొంతరబోయిన మహే శ్వరి కపసాగర్‌, మోదుగు లావణ్య శేఖర్‌ రెడ్డిల తో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి హెల్త్‌ సీటి డైరెక్టర్‌ డాక్టర్‌ చామకూర ప్రీతిరెడ్డిపై కాంగ్రెస్‌ నాయకుడు రాపోలు రాములు మీడియా సమావేశంలో ఇష్టానుసార ంగా మాట్లాడడం జరిగిందని ఇది మహిళల అభివద్ధిని కించపరిచే విధంగా ఉందని అన్నారు. రాజకీయాలలో అపారమైన అనుభ వం ఉన్న రాపోలు రాములు ఒక మహిళను పట్టుకుని ఇష్టానుసారంగా సంస్కారహినంగా మాట్లాడడం సరికాదని అన్నారు. మహిళల పట్ల ఏలా నడుచుకోవాలో మీ పార్టీ మీకు నెర్పలేదా అని ప్రశ్నించారు. మీకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు వారు కూడా రాజకీయా లలోకి వస్తే ఇలా మాట్లాడితే ఏలా ఉంటుందో వారినే అడుగు అంటు హితవు పలికారు. ఇప్పటికైనా ప్రీతి రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

Spread the love