మంచి సినిమా అని ప్రశంసిస్తున్నారు

మంచి సినిమా అని ప్రశంసిస్తున్నారుక్లూస్‌ టీం ప్రాధాన్యతను చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం అథర్వ. కార్తీక్‌ రాజు, సిమ్రన్‌ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మహేష్‌ రెడ్డి దర్శకుడు. నూతలపాటి నర సింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలను అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ ఈవెంట్‌లో హీరో కార్తీక్‌ రాజు మాట్లాడుతూ,’ మా చిత్రానికి ఫుల్‌ పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. చాలా చోట్ల హౌస్‌ ఫుల్స్‌ కనిపించాయి. మొదటి రోజే ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. మంచి సినిమాను తీశామని అంటున్నారు. అక్కడే మా దర్శకుడు మహేష్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్‌ వస్తుందని అనుకోలేదు. ఆడియెన్స్‌ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’ అని నిర్మాత సుభాష్‌ నూతలపాటి చెప్పారు. దర్శకుడు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘కొత్త పాయింట్‌, కొత్త కథ చెబితే ఆడియెన్స్‌ ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే క్లూస్‌ టీం మీద సినిమా తీశాను. శ్రీ చరణ్‌ పాకాల అందించిన ఆర్‌ఆర్‌, పాటలు సినిమాకు ప్రాణంలా నిలిచింది. సాయి చరణ్‌ విజువల్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి’ అని తెలిపారు.

Spread the love