హైద‌రాబాద్‌లో పలు చోట్ల వ‌ర్షం..

నవతెలంగాణ – హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో బుధ‌వారం సాయంత్రం ప‌లు చోట్ల వ‌ర్షం కురిసింది. దీంతో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కూడా ఎండ దంచికొట్టింది. మ‌ధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత‌మై ఉంది. సాయంత్రానికి వ‌ర్షం కురిసింది. తార్నాక‌, రాంన‌గ‌ర్, ఉస్మానియా యూనివ‌ర్సిటీ, లాలాపేట‌, సికింద్రాబాద్, హ‌బ్సిగూడ‌, బేగంపేట‌, సోమాజిగూడ‌, అమీర్‌పేట‌, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంప‌ల్లి, ల‌క్డీకాపూల్, నాంప‌ల్లి, కోఠి, అంబ‌ర్‌పేట‌, ముషీరాబాద్, చిక్క‌డ‌ప‌ల్లి, ఉప్ప‌ల్, బోడుప్ప‌ల్, ఎల్‌బీన‌గ‌ర్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది.

Spread the love