కష్టాలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ

– కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తాం
–  ఎన్నికల ప్రచారంలో  దుద్దిల్ల శ్రీధర్ బాబు
నవ తెలంగాణ- కాటారం:
ప్రజల కష్టాలు తెలుసుకొని తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని, జగ్గయ్య పల్లెలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లలో శ్రీధర్ బాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చింతకానిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కార్డులకు దేవాలయంలో పూజలు నిర్వహించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నదని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అవినీతి పాలన మొదలైందని,  లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేవలం కమిషన్ల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రెండు సార్లు కెసిఆర్ నీ నమ్మి గద్దెనెక్కిస్తే ప్రజా శ్రేయస్సును మరిచి కేవలం కమిషన్లు తెచ్చిపెట్టే పథకాలను అమలులోకి తీసుకొచ్చి వేల కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు. మన ప్రాంతంలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మన నీల్లు, మన ఇసుక ఇక్కడ నుండి తరలించి మన కష్టాలను మరిచారని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ ల బ్యాక్ వాటర్ వల్ల మన ప్రాంత రైతులు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ముంపునకు గురై అధిక మొత్తంలో నష్టపోతున్నారని అన్నారు. నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం ఇప్పటివరకు అంద లేదని,  ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మన భూములను త్యాగం చేస్తే కనీసం పంట నష్ట పరిహారం ఇచ్చి మనల్ని ఆదుకోవడం మర్చిపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, చింతకాని సర్పంచ్ బాబా, మాజీ ఎంపీటీసీ కోసరి భాస్కర్,  ప్రచార కమిటీ కన్వీనర్ కుంభం రమేష్ రెడ్డి, కో కన్వీనర్ నాయిని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె అమీర్, సర్పంచ్ ఆత్మకూరీ రాజయ్య యాదవ్, అంగజాల అశోక్ కుమార్,
ఓబీసీ అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, టౌన్ అధ్యక్షులు మంత్రి నరేష్    తదితరులు పాల్గొన్నారు.
Spread the love