ఆడబిడ్డలు‌ బరువు కావద్దనేదే ప్రభుత్వ ఉద్దేశం

కళ్యాణ లక్ష్మీ,షాది ముభారక్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – డిచ్ పల్లి
తల్లిదండ్రులకు ఆడబిడ్డలు బరువు కావద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను అందజేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.మంగళవారం నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యాలయం లో డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, దానిలో ఎవరికి అనుమానం అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో నిజామాబాద్ రూరల్ అబివృద్ధి చెందుతుందని, రాబోవు రోజుల్లో గ్రామాల్లో నేలకోని ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ప్రజల కాంగ్రెస్ పార్టీ కి పట్టంకట్టరని,అదే విధంగా పాలన ఉంటుందని వివరించారు. అనంతరం మంజురైన చెక్కులను లాబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, పోలసాని శ్రీనివాస్, తిర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి చింతల కిషన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హబిబ్, మోహ్సిన్,
తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love