నరేంద్ర మోడీ సభకు బయలుదేరిన నిజం సాగర్ మండల ప్రజలు

నవతెలంగాణ- నిజాంసాగర్

నిజం సాగర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు నిజామాబాద్ గిరి రాజ్ కళాశాలలో నిర్వహించబడిన నరేంద్ర మోడీ సభకు భారీగా ప్రజలు బయలుదేరారు. ఈ సందర్భంగా  మండల నాయకుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ 8000 కోట్ల రూపాయలతో వివిధ పనులను ప్రారంభిస్తున్నారని అలాగే నిజామాబాద్ కి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాడని ఆయన అన్నారు. అయితే వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు సభకు వెళ్లకుండా ప్రజలకు భయభ్రాంతులను చేస్తున్నారని ఆయన అన్నాడు మీరు ఎన్ని భయభ్రాంతులను చేసినా సభకు అడ్డుకోలేరని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా ఈ బెదిరించడం ఆపాలని లేదంటే ఎలక్షన్ టైం లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి కుమ్మరి బాలు కురుమ మల్లయ్య బిజెపి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Spread the love