కింగ్స్‌ ప్యాలెస్‌ యజమాని ఇంట్లో ఐటీ దాడులు

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐటీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కింగ్స్‌ ప్యాలెస్‌ యజమాని షానవాజ్‌ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, గతంలోనూ కింగ్స్‌ ప్యాలెస్‌ యజమాని షానవాజ్‌ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో ఆయన దుబాయ్‌ వెళ్లిపోయారు. తాజాగా ఆయన్ను దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేస్తున్నారు.

Spread the love