ధీరజ్ సాహుకు చెందిన ప్రాంగణాలపై ఐటీ దాడులు

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు‌కు చెందిన ఒడిశా, ఝార్ఖండ్‌లోని ఆయన ప్రాంగణాలపై ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన లెక్కల్లో చూపని మొత్తం రూ. 351 కోట్లకు చేరుకుంది. ఒకే విడతలో ఇంత పెద్దమొత్తంలో పట్టుబడడం ఐటీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ నెల 6న రైడ్స్ మొదలయ్యాయి. మొత్తం 176 డబ్బు సంచుల్లో 140 బ్యాగుల్లోని సొమ్మును లెక్కించారు. మూడు బ్యాంకులకు చెందిన 50 మంది అధికారులు 40 కౌంటింగ్ మెషీన్ల ద్వారా సొమ్ము లెక్కిస్తున్నారు. నగదు లెక్కింపునకు మెషీన్లు సరిపోకపోవడంతో మరిన్ని మెషీన్లతోపాటు సిబ్బందిని కూడా రప్పించి కౌంటింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో ఎక్కువ మొత్తం ఒడిశాలోని బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రాంగణంలోనే పట్టుబడింది. ధీరజ్ సాహు కుటుంబం మొత్తం లిక్కర్ వ్యాపారంలోనే ఉంది. ఒడిశాలో ఆయనకు అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి.

Spread the love