పంజాగుట్ట పీవీఆర్‌లో సినిమా నడుస్తుండగానే వర్షం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లూ, వీధులు ఎకమయ్యాయి. రహదారులపై మోకాలి లోతులో నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. ఇక లోతట్టు ప్రాంతాల సంగతైతే చెప్పక్కర్లేదు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్ సహా మరో ప్రాంతంలో వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా హాల్‌లో ఏకంగా బయట కురిసినట్టే వర్షం పడింది. సినిమా నడుస్తుండగానే పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రేక్షకులు తడిసిపోయారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రేక్షకులు సినిమా మధ్యలోనే బయటకు వెళ్లారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు.

Spread the love