వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ ఎంపీ , చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకట స్వామికి ఊహించని షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోమజిగూడాలో ఉన్న వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అటు మంచిర్యాలలో వివేక్ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఐటీ దాడులను నిరసిస్తూ వివేక్ వెంకట స్వామి నివాసం వద్దకు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఐటీ దాడులు జరుగుతున్నాయి.  ఆ పార్టీ లీడర్లు. వివేక్ కు ప్రచారంలో వస్తున్న ఆదరణ చూసి కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love