హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న విజ్‌ రియాల్టీస్‌, విజ్‌ ప్రాపర్టీలపై సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్‌, కోహినూర్‌, ఆర్ఆర్ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో సైతం నేడు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కేఎం కోహినూర్‌ సంస్థకు చెందిన ప్రతినిధుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పాన్‌మసాలా, స్పైసెస్‌ వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టల్‌ మెన్షన్‌కు చెందిన మజీద్‌ఖాన్‌ ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ సహా ఢిల్లీ, కర్నాటక, నొయిడాలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Spread the love