బూత్ ల్లో అధిక ఓట్లు పడేలా చూడాలి

నాయకులతో మాట్లాడుతున్న అబ్సార్ వైర్
నాయకులతో మాట్లాడుతున్న అబ్సార్ వైర్

– కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అబ్సార్ వైర్ అబేద
 నవతెలంగాణ – మాక్లూర్ బూత్ స్థాయిల్లో అధిక ఓట్లు పడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అబ్సర్ వైర్ అబేద తెలిపారు. గురువారం మండల కేంద్రంలో అసెంబ్లీ అబ్సార్ వైర్ అబెద అధ్వర్యంలో బూత్ స్థాయిలో ఎన్నికల పనులను పరిశీలించారు. గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో వచ్చే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చించారు. గ్రామాల్లో బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అధిక ఓట్లు వచ్చే విధంగా కష్టపడి పని చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అధికంగా ప్రచారం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షులు అలిమ్, సోషల్ మీడియా ఇంఛార్జి జైల్ సింగ్, నాయకులు స్వామి పాల్గొన్నారు.

Spread the love