నవతెలంగాణ – నార్కెట్‌పల్లి: ఈ రోజు ఉదయం ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై కృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు వేమూరి-కావేరి ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక టైర్ పేలడంతో రాపిడికి గురవడంతో ఘటన జరిగింది.