రజాకార్ల వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు..

– అధికారం కొరకు బీజేపీ ముస్లింలను చేయడం విడ్డూరం
– టీపీఎస్కే రాష్ట నేత జి రాములు 
నవతెలంగాణ – ధూల్ పేట్ : రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనని, అధికారం కొరకు బీజేపీ ముస్లింలను చేయడం విడ్డూరంగా ఉందని టీపీఎస్కే రాష్ట నేత జి రాములు అన్నారు.  సీపీఐ(ఎం) హైదరబాద్ సౌత్ జిల్లా కమిటి ఆధ్వర్యం లో ఆదివారం సంతోష్. నగర్ లో జరిగిన  తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ  సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో పాలకులు సాయుధ పోరాటం తో ఎలాంటి సంబంధం లేని వారు ఈరోజు మాట్లాడుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బిజెపి అధికారం కోసం సాయుధ పోరాటానికి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రించడానికి ప్రయత్నించండం దుర్మార్గమన్నారు. ఆనాటి జమీందారులు, నిజాం గుండాలు(రజాకారులు) గ్రామాలలో అంతులేని అరాచకం, దౌర్జన్యం, లూటీ, మానభంగం, మానవత్వం మంట కలిపే విధంగా ఇష్టారాజ్యంగా అడ్డు అదుపు లేకుండా అరాచకం సృష్టించిచె వారన్నారు. ఈ అరాచకానికి ఆపడానికి కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం చేశారన్నారు. జమీందారులని రజాకారులని తరిమికొట్టారన్నారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంచారన్నారు. అధికారం కమ్యూనిస్టుల చేతికి పోతుందని భావించి నిజాం రాజు నెహ్రూతో కుమ్మక్కై ఇండియన్ సైన్యంతో 4వేల మంది కమ్యూనిస్టులను పొట్టన పెట్టుకున్నారన్నారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ బిజెపి వక్రీకరించి సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని, బిజెపి విమోచన కాంగ్రెస్ విలీనం అంతా బూటకమన్నారు. దేశ ప్రజలకు ఈ పోరాటం గురించి సత్యాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు విఠల్, నాగేశ్వర్, అబ్దుల్ సత్తార్, కృష్ణ, కిషన్, మహేష్ దుర్గె, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love