మహిళా రిజర్వేషన్లకై కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే

– మాజీ మేయర్ ధర్మపురి సంజీయ్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : భారత దేశంలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ నే అని అలాగే గతంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వ పూర్వ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విద్య, వైద్య,సాంకేతిక రంగంలో మహిళలకు రిజర్వేషన్లు అమలుపరచడని, చట్టసభల్లో కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మహిళ బిల్లు కోసం తీవ్రంగా ప్రయత్తించారని అప్పటి ప్రతిపక్షాలు సహకరించలేకపోవడం వల్ల ఆగిపోయినట్లు తెలిపారు. ఇటీవల తుక్కుగూడ  కాంగ్రేస్ పార్టీ ప్లీనరీ, భారీ బహిరంగ సభ ను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదములు చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ మ్యానిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త గడపగడపకు తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.కర్ణాటక లో మాదిరిగా ఇక్కడ కూడ కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.జిల్లాలో పార్టీ నాయకులమంతా సమిష్టిగానే ఉన్నామని, తమంతా పార్టీ విజయానికి శ్రమిస్తమన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ ఆకుల చిన్న రాజేశ్వర్, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love