– కొనసాగుతున్న సమ్మె.. మద్దతు పలికిన కాంగ్రెస్, ప్రజా పంథా

నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపీ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో కాంగ్రెస్, ప్రజా పంథా నాయకులు సమ్మె శిభిరం వద్దకు చేరుకుని వారికి మద్దతు ప్రకటించారు.  కాంగ్రెస్ పీసీసీ నాయకురాలు నాగమణి,మండల అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు, రాంబాబు, ప్రజా పంథా జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ రావులు పాల్గొని సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో గత 35 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం పంచాయతీ స్వీపర్ లకు రూ. 15,600 లు చెల్లించాలని,మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి వేతనాలు చెల్లించాలని, కారో బార్ బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గ్రాంట్ టీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయీ నాయకులు దన్జూ నాయక్, చల్లా రమాదేవి, మరియమ్మ,కృష్ణకుమారి, మందపాటి వెంకన్న బాబు,సత్యవరపు సంపూర్ణ,వేముల ప్రతాప్ లు పాల్గొన్నారు.

Spread the love