తగ్గేదేలే…

It's going down...– 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో
– 10 అవార్డులతో తెలుగు సినిమా విజయకేతనం
– జాతీయ ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్‌ రికార్డ్‌
– ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్పలకు అవార్డుల పంట
చంద్రయాన్‌ 3 గ్రాండ్‌ సక్సెస్‌తో ప్రపంచ దేశాలు మన దేశం వైపు ఎంత సంభ్రమాశ్చర్యంగా చూశాయో, 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా 10 అవార్డులు పొందిన తెలుగు చిత్ర సీమవైపు యావత్‌ భారతీయ సినీ పరిశ్రమలు అంతే సంభ్రమాశ్చర్యంగా చూస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా 69 ఏండ్ల జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగు కథానాయకుడు అల్లు అర్జున్‌కి రావడం ఓ విశేషమైతే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి తండ్రీతనయులు ఎం.ఎం.కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ అవార్డులకు ఎంపిక కావడం మరో విశేషం. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల కోసం 2021వ సంవత్సరానికిగాను ఎంపికైన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణుల వివరాలను గురువారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రం నిలవగా, జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ (పుష్ప), జాతీయ ఉత్తమ నటిగా ఈ ఏడాది ఇద్దరు కథానాయికలు అలియాభట్‌ (గంగుభాయి కతియావాడి), కృతిసనన్‌(మిమి) చిత్రాలకు ఎంపికవ్వగా, జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ చిత్రం అవార్డుని సొంతం చేసుకుంది. మిగిలిన వివరాలు సినిమాపేజీలో..

Spread the love