దేవరకొండలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజన ప్రజల అభివద్ధికి ప్రభుత్వం కషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్రాశంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు.సోమవారం దేవరకొండ పట్టణ కేంద్రంలో నిర్వహించిన గిరిజనసంఘం సమావేశం లో ఆయన మాట్లాడారు.నల్లగొండ జిల్లాలో గిరిజన ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.ఉపాధి లేక వలస వెళుతున్నారని ,గిరిజన సమస్యల పరిష్కారానికి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.అర్హులైన గిరిజనులందరికీ గృహలక్ష్మీపథకం వర్తింపజేయాలని కోరారు.జిల్లాలో గిరిజన సమస్యలపై డిక్లరేషన్‌సభను త్వరలో నిర్వహించి గిరిజనుల వ్యతిరేకమైన పార్టీలకు ఓడించాలని ప్రజలకు పిలుపు ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రమావత్‌ పాండునాయక్‌, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్లవెంకటయ్య, నాగటి నాగరాజు ,తదితరులు పాల్గొన్నారు.

Spread the love