ఐటెల్‌ ఎస్‌23 ఆవిష్కరణ

న్యూఢిల్లీ : దేశంలో తొలిసారి చౌక ధరలో 16జిబి ర్యామ్‌, 50 ఎంపి ఎఐ కెమెరాతో ఐటెల్‌ ఎస్‌23ని ఆవిష్కరించినట్లు ఐటెల్‌ వెల్లడించింది. దీని ధరను రూ.8,799గా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌ పోర్టల్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇందులో 4జిబి ర్యామ్‌, 8జిబి, ర్యామ్‌ వేరియంట్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఎస్‌23 మోడల్‌ 128జిబి మెమోరితో వస్తోన్నప్పటికీ 1టివి మైక్రోఎస్‌డి కార్డ్‌తో విస్తరించుకోవచ్చని తెలిపింది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో దీన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

Spread the love