నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ సమస్యలు పరిష్క రించే వరకు నిరవధికంగా సమ్మె చేస్తామని హైదరాబాద్ రేషన్ డీలర్స్ అసోసియేషన్, రాష్ట్ర డీలర్ల జేఏసీ నాయకులు తెలి పారు. సోమవారం హైదరాబాద్ లోని సీఆర్‌ఓ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ రవీందర్, కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్ తది తరులు మాట్లాడుతూ, గౌరవ వేతనం, కమిషన్ పెంపుపై స్పష్ట మైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్ మాట నిలబెట్టుకో లేదని విమర్శించారు.