– విలేకరుల సమావేశంలో చంద్రబాబు
అమరావతి: ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్‌రెడ్డి తిరుమల వెళ్లితే దేవాలయ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం యంత్రం రాష్ట్ర సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. గత ఐదేళ్లలో డిక్లరేషన్ ఇవ్వలేదని జగన్ చెప్పడం సంప్రదాయా లను, చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని తెలిపారు. అన్యమతస్తులు ఎవ్వరు తిరుమలకు వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వడం సాంప్రదాయమని అన్నారు. జగన్‌కు కూడా అదే వర్తిస్తుందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిగా వెళ్తే ఎవ్వరూ ఏమీ అడగరు. అంతమాత్రాన అంగీకరించినట్లు కాదు. నిబంధనల ను పాటించడం బాధ్యత’ అని అన్నారు. తనను తిరుమల వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నా రన్న జగన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. ర్యాలీలు, జన సమీకరణలు చేయవద్దని, సాంప్రదాయాలు పాటిం చాలని మాత్రమే చెప్పామని తెలిపారు. తిరుమలకు వెళ్లవద్దంటూ జగన్‌కు పోలీసులు ఏమైనా నోటీసులు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఇస్తే చూపిం చాలని అన్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ వెళ్లడం లేదన్నారు. గతంలో జమ్మూకాశ్మీర్ సిఎం వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చివ వెళ్లారని పేర్కొన్నారు. ‘మనది సెక్యులర్ దేశం. మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలిగాని మనో భావాలు దెబ్బతీసేందుకు కాదు.’ అని చంద్రబాబు అన్నారు.
మీరు ఎలా చెబుతారు?
. ‘ఎఆర్ డెయిరి ఎనిమిది ట్యాంకర్లు పంపింది. వాటిలో నాలుగింటిని వాడారు. ఎక్కడ వాడారన్నది తరువాత. మిగిలిన నాలుగింటిలో నెయ్యిని టెస్ట్‌కు పంపారు. కల్తీ జరిగినట్లు వచ్చింది. వాటిని వెనక్కి పంపారు. నివేదిక ఇచ్చింది ఎన్‌డిడిబి, మేం కాదు. అంటే అర్ధం ఏమిటి? వాడిన నెయ్యిలో కూడా కల్తీ ఉందనే కదా! లేదని మీరు ఎలా చెబుతారు?’ అని జగన్‌మోహన్‌రెడ్డి నుద్ధేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఇఓ చెప్పలేదు. నివేదికలు లేవు’ అంటూ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. టెండర్లు పిలవడానికి ఎందుకు కండీషన్లు ఎందుకు మార్చారన్నారు. ట్రేడర్లను మార్చి నాసిరకం నెయ్యి సరఫరా చేశారని అన్నారు. అనుమానం వస్తే టెస్టుకు పంపించొచ్చని కాంట్రాక్టులో ఉందని, దాన్ని ఓవో చేశారని అన్నారు. జగన్ వ్యాఖ్యలు ఎన్‌డిడిబి రిపోర్టునూ తప్పుబట్టే విధంగా ఉందని పేర్కొన్నారు. రిపోర్టును బయటపెట్టకపోతే తాము తప్పుచేసిన వారిగా మిగిలిపోతామని, అందువల్లే బయట పెట్టామని చెప్పారు. ప్రతి ఏడాది ఆగస్టు 15 తరువాత పవిత్రోత్సవాలు చేస్తారని, ఈ ఏడాది శాంతియాగం కూడా చేశారని తెలిపారు.