అమరావతి : శాసనసభ ఆవరణలో తమకు కేటాయించిన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపు సమావేశమయ్యారు. గతంలో పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఇకముందు సమావేశాలకు హాజరవ్వాలా? లేదా? అనే అంశంపై చర్చించారు.
శనివారం పులివెందుల పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన నేరుగా అక్కడకు వెళతారని తెలిసింది. స్పీకరు ఎన్నిక అనంతరం వెళతారా, లేదా అనేది వైసిపి శాసనసభాపక్షం స్పష్టత ఇవ్వలేదు.