నవతెలంగాణ – హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.