జగదీశా.. నీకు జన్మంతా రుణపడి ఉంటాం..

Jagdeesha.. we owe you our whole life..– జగదీశ్వర్ రెడ్డి వీరాభిమాని ఐతగోని విజయ్ గౌడ్..
నవతెలంగాణ – మునుగోడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు కమ్ముతాయన్న వారికి కనువిప్పు కలిగే విధంగా 24 గంటల కరెంటు ఇచ్చిన మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు జన్మంత రుణపడి ఉంటారని జగదీశ్వర్ రెడ్డి వీరాభిమాని ఐతగోని విజయ్ గౌడ్ అన్నారు. గురువారం మాజీ మంత్రి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో  పుట్టినరోజు సందర్భంగా కేక్  కట్ చేసి ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమంలో ఈద శరత్ బాబు, గజ్జల బాలరాజు, మారగోని అంజయ్య,యడవల్లి సురేష్ కుమార్,దోటి కరుణాకర్,  విజయ్, బొల్లం సైదులు, జంగిలి సాంబయ్య, గుర్రాల సురేష్, సాదురాము, దుబ్బ రాజశేఖర్, ఓరంగంటి శంకర్, నందిపాటి వెంకన్న, బోయ లింగస్వామి, బొలుగూరి శీను, జిల్లా సుఖేందర్ గౌడ్ , బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.
Spread the love