ఇప్పుడు ప్రతిరోజూ సంతోషంగా ఉంటున్నా : జగ్గారెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే కనుక గెలిచిన ఒక్కరోజు మాత్రమే ఆనందంగా ఉండేవాడినని… కానీ ఇప్పుడు ప్రతిరోజూ సంతోషంగా ఉంటున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తనకు టిక్కెట్ కావాలనుకుంటే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతానని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. ఆ పార్టీలో చాలామంది షార్ట్ కట్ నేతలు ఉన్నారని విమర్శించారు. ఆ పార్టీలోని నేతల చరిత్ర అంతా తనకు తెలుసునని ధ్వజమెత్తారు.

Spread the love