నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అరెకపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పంచాయితీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ.. తమ జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాంతంగానే ఉందని, పోలీసులు బీఆర్ఎస్ నేతలను పట్టించుకోవాలా? ప్రజలను పట్టించుకోవాలా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.