నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్ష్మీపూర్ బాలాజీ నగర్ కర్లపల్లి గ్రామాలలో మంగళవారం ఆయా గ్రామ ఇన్చార్జిల ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి మరియు ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, భారత మాత నుదుటిన తిలకం దిద్దిన పోరాట వీరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని, కాంగ్రెస్ పార్టీ కేవలం దేశానికి స్వాతంత్ర్యం కోసమే కాంగ్రెస్ పార్టీ సమూహం ఏర్పడిందని అన్నారు. అలాగే బాపు గాంధీజీ గారు భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం అహింస అనే ఆయుధాన్ని ఎంచుకొని పోరాటం చేసి స్వాతంత్ర్యం వచ్చేదాకా పోరాటం చేశాడని, అలాగే స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిపి, అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ గారికి రాజ్యంగా బాధ్యతలు ఇచ్చి అతి పెద్ద రాజ్యంగాన్ని నిర్మించే స్వేచ్చను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 1950 జనవరి 26 నుండి భారత దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అని అన్నారు. భారత దేశాన్ని సర్వ సత్తాక, సార్వబౌమధికార, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం అని, అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ భారతదేశం రాజ్యాంగం యొక్క హక్కు అని అన్నారు. అలాగే తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రజల ఆకాంక్ష వలన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని, అప్పటినుండి దొరల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పులకోబిలోకి వెళ్ళిందని, రాష్ట్రంలో ఉద్యాగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య పరిగిపోయిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 58000 ఉద్యగాలు ఇచ్చి యువతకు భవిష్యత్తు కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రతి పథకం పేదల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ, భూమి ఉన్న వారికి రైతు భరోసా ద్వారా 12000 రూపాయలు పెట్టుబడి సాయం, అలాగే భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా, పేదలకు రేషన్ కార్డులు పంపిణీ, రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల యువతకు బ్యాంకులతో కలిసి సబ్సిడీ రుణాలు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం అని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అత్యున్నత పథకాలతో పేదల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తుంది అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు కడుపునిండా భోజనం పెట్టడమే లక్ష్యంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినం అని అన్నారు. అలాగే ఇటీవల వచ్చిన అకాల వడగండ్ల వర్షం వలన నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం అందిస్తాం అని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులందరికీ అండగా సీతక్క ఉంటారని అన్నారు. గాంధీజీ మరియు అంబేద్కర్ గారి చిత్రపటాలకు పూలమాల వేసి, వారు చేసిన త్యాగాల వలనే మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది అని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిందని, వారి విధానాలతో దేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కార్మిక శాఖా జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్ గార్లతో పాటుగా గోవిందరావుపేట మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.