జైపూర్‌ – ముంబై రైల్లో కాల్పుల కలకలం.

Firing in Jaipur-Mumbai train.– నలుగురు మృతి
ముంబై: జైపూర్‌ – ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు వాపి – మీరా రోడ్‌ స్టేషన్‌ మధ్యలో చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్‌ను చేతన్‌గా గుర్తించారు. మృతుల్లో ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Spread the love