నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక ఈ ఏడాది దుమ్మురేపుతున్న జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏకంగా 700కి పైగా పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీసుల్లోనూ పర్వాలేదనిపించాడు. ఇలా ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో జైస్వాల్ ఇప్పటికే 1,280 రన్స్ చేశాడు. మరో 283 పరుగులు సాధిస్తే భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2010లో సచిన్ 14 మ్యాచుల్లో 1,562 రన్స్ చేశారు. ఇండియా తరఫున ఇప్పటివరకు ఈ పరుగులే అత్యధికం. ఓవరాల్‌గా పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ టాప్‌లో ఉన్నాడు. 2006లో 11 టెస్టుల్లో యూసఫ్ 1,788 పరుగులు చేశాడు.