ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది: జానారెడ్డి

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తాను ఏ పార్టీలో ఉన్నా టిక్కెట్లు, పదవులు అడగలేదన్నారు. తనకు ఉన్న ప్రజాదరణ చూసి పార్టీలే అవకాశాలు ఇచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ తప్పిదాలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణమని అన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించలేదన్నారు.

Spread the love