నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయను న్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కూకట్‌పల్లి, ఎల్బీనగర్, నాగ ర్‌కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నా బాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానా పూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో పోటీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు.