ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌

ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌– మార్టిగేజ్‌ రిలీజ్‌ కోసం రూ.40,000 లంచం డిమాండ్‌
నవతెలంగాణ-జనగామ
లోన్‌ మంజూరు విషయం లో లంచం తీసుకుంటూ జనగామ మునిసిపల్‌ కమిష నర్‌ రజిత ఏసీబీకి చిక్కారు. మార్టిగేజ్‌ రిలీజ్‌ కోసమని రూ. 40000 లంచం తీసుకుండగా సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెప్పిన వివరాల ప్రకారం.. లింగాల ఘన్పూర్‌ గ్రామానికి చెందిన శెట్టిపల్లి రాజు జనగామ పట్టణంలో జి-ప్లస్‌ టు ఇల్లు నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం మొత్తం ఏరియాలోని విలువకు 10 శాతం మార్టిగేజ్‌ చేశారు. ఇల్లు పూర్త యిన అనంతరం మార్టిగేజ్‌ నిధులు రిలీజ్‌ చేయాల్సి ఉంది. అందుకోసం మున్సి పల్‌ కమిషనర్‌ను ఆశ్రయించగా రూ. 60 వేలు లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని రూ.40 వేలకు రాజు ఒప్పుకున్నాడు. అనంతరం అతను ఏసీబీని ఆశ్రయించారు. డబ్బులు కమిషనర్‌ రజిత చెప్పినట్టు డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్‌, డ్రైవర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపర్చనున్నారు.

Spread the love