ఎమ్మెల్యేగా వట్టె జానయ్య యాదవ్ గెలుపు తధ్యం: రేణుక యాదవ్

– బహుజన్ సమాజ్ పార్టీ లో భారీగా చేరికలు.
నవతెలంగాణ- సూర్యాపేట
రానున్న ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా వట్టె జానయ్య యాదవ్ గెలిచి తీరుతారని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జ్ ,13వ కౌన్సిలర్ వట్టె రేణుక యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక గాంధీ నగర్ లోని జానయ్య నివాసంలో చింతకాయల జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో 4, 5 వార్డులలో గల పలు పార్టీలకు చెందిన వారు బీఎస్పీ లో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.వట్టే జానయ్య యాదవ్ మచ్చలేని మనిషి అని ఆయన పై నిందలు, అబండాలు, వేయడం సరికాదని తెలిపారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మంత్రి ఇప్పటికైనా తన వక్రబుద్ధిని మార్చుకోవాలని హెచ్చరించారు.రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు మంత్రికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. బహుజన సమాజాన్ని నవనిర్మాణం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.  ఇకనుండి అరాచక పాలనకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.ఈ  కార్యక్రమానికి అధ్యక్షత వహిoచిన బుడిగ మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% వాటా కలిగిన బీసీ బహుజన సంఘం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బహుజన్ సమాజ్  పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో వట్టె జానయ్య యాదవ్ గెలుపుకు నిరంతరం శ్రమించి శాసనసభకు పంపించడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంభం వెంకన్న యాదవ్, వల్లాల సైదులు యాదవ్, ఆవుల అంజయ్య యాదవ్, మొహమ్మద్ చాంద్ భాషా, బుడిగ మల్లేష్ గారు,ఇరుగు రమణ,మొండీకత్తి వెంకన్న, లింగయ్య, శ్రీనివాస్, మొండీకత్తి ఈదయ్య, మొండికత్తి శ్రీను, వల్లపట్ల మధు, మొండి కత్తి లింగయ్య (మాస్)మొండికత్తి  నవీన్, మొండికత్తి దేవయ్య,మొండి కత్తి జానమ్మ, బి నాగు నాయక్, పాండే, నాగు, బి  కృష్ణ, బి రాంకీ సెల్, సతీష్, పాగు, శంకర్, లక్ష్మి, శోభన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love