ఎల్బీనగర్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన జానకి రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ డివిజన్ ఏసిపి గా జానకి రెడ్డి బుధవారం నాడు శ్రీధర్ రెడ్డి నుంచి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఏసీపి జానకి రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.. బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో ఇక్కడ ఏసీపీ గా పనిచేసి బదిలీపై వెళ్లిన శ్రీధర్ రెడ్డికి సన్మానం చేయడం జరిగింది.

Spread the love