నవతెలంగాణ- అమరావతి: అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుకానుంది. ఈ సందర్భంగా జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వారాహి యాత్ర షెడ్యూల్‌ను తెలియజేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవుతారన్నారు. జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారన్నారు. నాలుగో తేదీన పెడనలో వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. జనసేనాధిపతికి దారి పొడవునా స్వాగతం పలికేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకుంటారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఐదో తేదీన కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుందని చిల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.